ఇంటి నుంచి వెళ్లి తప్పిపోయిన యువతి

by Chintha Aamani |   (  Updated:2025-06-16 16:29:14  IST  )

ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ మండలం

ఇంటి నుంచి వెళ్లి తప్పిపోయిన యువతి
X

దిశ, ఆదిభట్ల : ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ మండలం నాదర్గుల్ ప్రాంతంలోని అశోక్ రెడ్డి కాలనీకి చెందిన కోవటి యశస్విని (18) అనే అమ్మాయి ఇంటి నుంచి తప్పిపోయినట్లు తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు... యశస్విని ఆదివారం తమ ఇంట్లో వదిలి తల్లిదండ్రులు ఫంక్షన్ నిమిత్తం బయటకు శుభకార్యానికి వెళ్లి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అమ్మాయి కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. అనంతరం తెలిసిన బంధువుల ఇండ్లలో, ఫ్రెండ్స్ ను ఎవరిని అడిగినా కూడా ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటి నుండి తప్పిపోయిన అమ్మాయి 9వ తరగతి వరకు చదివి అనంతరం చదువు మానేసి ఇంటి వద్ద ఉంటున్నట్లు సూచించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story