- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ బావిలో పడి మహిళ ఆత్మహత్య
by Ratna Kumari |
దిశ, నాగిరెడ్డిపేట్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలోని చీనూర్ గ్రామంలో చోటుచేసుకుంది. నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ హౌస్

X
దిశ, నాగిరెడ్డిపేట్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలోని చీనూర్ గ్రామంలో చోటుచేసుకుంది. నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనోహర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చీనూరు గ్రామానికి చెందిన మేకల అంజవ్వ (52) అనే మహిళ గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితం పై విరక్తి చెంది గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. మృతురాలు గర్భాశయ క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని ఆయన తెలిపారు. మృతురాలి కుమారుడు మేకల కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ తెలిపారు.
Next Story






