- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: ఒకే ఇంటిని ఇద్దరికి అమ్మిన కిలాడీ లేడీ.. రూ.25 కోట్లతో పరార్
అధిక వడ్డీల ఆశ చూపి పలువురి నుంచి కోట్ల రూపాయల డబ్బు అప్పుగా తీసుకుని భారీ స్థాయిలో మోసం చేసిన ఓ ఘరానా లేడీ రూ. 25 కోట్లకు పైగా వసూలు చేసి పరార్అయిన ఘటన శనివారం వనస్థలిపురం పోలీస్స్టేషన్పరిధిలో కలకలం రేపింది.

దిశ, వనస్థలిపురం: అధిక వడ్డీల ఆశ చూపి పలువురి నుంచి కోట్ల రూపాయల డబ్బు అప్పుగా తీసుకుని భారీ స్థాయిలో మోసం చేసిన ఓ ఘరానా లేడీ రూ. 25 కోట్లకు పైగా వసూలు చేసి పరార్అయిన ఘటన శనివారం వనస్థలిపురం పోలీస్స్టేషన్పరిధిలో కలకలం రేపింది. వనస్థలిపురం పరిధిలోని కమలానగర్‌లో ఉండే బద్దం జ్యోతిరెడ్డి తీసుకున్న అప్పుకింద ఇటీవల తన సొంత ఇంటిని ఒకరికి అమ్ముతానని చెప్పి అగ్రిమెంట్ చేయగా.. ఆయన బంధువులు ఆ ఇంట్లో ఉంటున్నారు. బుధవారం అదే ఇంటిని తనకు సేల్‌డీడ్ చేసిందని మరొకరు వచ్చి.. ఇంట్లో ఉంటున్న వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. ఇద్దరూ ఇల్లు తమదంటే తమదని ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కానీ ఇద్దరి వద్ద డబ్బులు తీసుకున్న సదరు మహిళ పరార్ అయినట్లు తెలుస్తోంది. అయితే బంధువులు, స్నేహితుల వద్ద నుంచి తెచ్చి డబ్బులు ఇచ్చామని, తమకు ఆత్మహత్యే శరణ్యమని ఇల్లు కొనుగోలు చేసిన బాధితులు వాపోతున్నారు. అయితే జ్యోతిరెడ్డిపై లక్షల రూపాయలు అప్పులు తీసుకుని ముఖం చాటేసిందని పలువురు బాధితులు ఇటీవల ఫిర్యాదు చేశారని వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మహేశ్తెలిపారు. శనివారం కూడా ఒకరు తన వద్ద రూ.46 లక్షలు తీసుకుని ఇవ్వడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యా చేస్తామని తెలిపారు.
అసలు విషయం ఇది..
స్థానికుల వివరాల ప్రకారం.. వనస్థలిపురం డివిజన్కమలానగర్లో ఉండే బద్దం జ్యోతిరెడ్డి వనస్థలిపురం, హయత్నగర్ప్రాంతాల్లో పలువురు రియల్టర్లు, రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుంది. అలా తనకున్న పరిచయాలతో రియల్టర్లు, మధ్యతరగతి వారే లక్ష్యంగా లక్షలల్లో వసూళ్లు చేస్తూ.. సులువుగానే డబ్బు సేకరించింది. తనకు పైసలు ఇచ్చిన వారికి నెలకు రూ.10 శాతం వడ్డీ ఇచ్చేది. ఆయా వడ్డీలను నెలనెలా క్రమం తప్పకుండా చెల్లిస్తుండడంతో జ్యోతిరెడ్డికి చాలా మంది ఈజీగా డబ్బు ఇచ్చారు. ఇలా రూ.కోట్లలో డబ్బు సేకరించినట్లు చెప్తున్నారు. అలా జ్యోతిరెడ్డి హయత్నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో కొంతమందికి రూ.10వరకు వడ్డీ ఇచ్చేలా అప్పులు తీసుకుంది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడుతున్నానని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేసింది. అయితే అందులో కొంత మంది రూ. కోట్లలో కూడా ఇచ్చినట్లు బాధితులు చెప్తున్నారు. ఎక్కువ మొత్తంలో దాదాపు రూ. 25 కోట్లకు పైగానే వసూలు చేసి.. తిరిగి అడిగిన వారికి ఇవ్వకుండా ముఖం చాటేసింది. అలా క్రమంగా బాధితులు తమ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి పెంచగా.. కమలానగర్‌లో తన సొంత ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. అలా ఆ ఇల్లును ఓ వ్యక్తి వద్ద దాదాపు రూ. 3 కోట్లు అప్పుగా తీసుకున్న సుజిత్ అనే వ్యక్తికి సేల్ అగ్రిమెంట్ చేసింది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన రామకృష్ణారెడ్డికీ సేల్‌డీడ్ చేసింది.
అలా జ్యోతిరెడ్డి ఇంట్లో అగ్రిమెంట్ చేసుకున్న సుజిత్ బంధువులు నివాసం ఉంటున్నారు. కాగా బుధవారం రాత్రి సేల్ డీడ్ చేసుకున్న రామకృష్ణారెడ్డి ఇల్లు తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని, ఇంటిని తమకు ఇవ్వాలని అడగగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది గమనించిన అటుగా వెళ్తున్న పోలీసులు గొడవను సద్దుమణిగేలా చేసి ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. జ్యోతిరెడ్డి తమ వద్ద కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని.. తమ జీవితాలను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు పలువురు జ్యోతిరెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే వివరాలు వెల్లడించాలని నిర్ణయించినట్టు తెలిసింది.






