- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఎస్ గూడెంలో మహిళ దారుణ హత్య.. ఇంతకీ ఎవరామె
గుర్తుతెలియని దుండగులు మహిళను దారుణంగా హతమార్చి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు.

X
దిశ, మరిపెడ : గుర్తుతెలియని దుండగులు మహిళను దారుణంగా హతమార్చి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయాగూడెంలో మంగళవారం వెలుగుచూసింది. ఎస్ఐ సతీష్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మరిపెడ మండలం పురుషోత్తమయా గూడెం గ్రామం నుంచి జల్లెపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో మహిళ విగతజీవిగా పడి ఉండటంతో గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు.
శివారు గ్రామస్తులు తమ గ్రామాలకు చెందిన మహిళ కాదని తెలపటంతో పోలీసులు క్లూస్ టీంను రప్పిస్తున్నారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా మండలంలోని ఉల్లేపల్లి గ్రామానికి చెందిన మహిళగా కొంతమంది గుర్తించి సదరు మహిళ వ్యవసాయకూలీలకు మేస్త్రీగా వ్యవహరిస్తోందని, సోమవారం ఉదయం పనివెళ్తున్నాని చెప్పి బయటకు వెళ్లినట్లు సమాచారం.
Next Story






