- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చోరీ అనుమానంతో మహిళపై దారుణం
ఝార్ఖండ్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. గిరిడీహ్ జిల్లా డుమ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం అపహరించిందనే అనుమానంతో ఓ మహిళను దారుణంగా కొట్టి జుట్టు కత్తిరించి అర్దనగ్నంగా గ్రామంలో ఊరేగించారు.

దిశ, వెబ్ డెస్క్: ఝార్ఖండ్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. గిరిడీహ్ జిల్లా డుమ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం అపహరించిందనే అనుమానంతో ఓ మహిళను దారుణంగా కొట్టి జుట్టు కత్తిరించి అర్దనగ్నంగా గ్రామంలో ఊరేగించారు. గ్రామంలోని నాగేశ్వర్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో బంగారం దొంగలించిందనే అనుమానంతో వారి ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఈ దారుణానికి పాల్పడ్డారు.
అయితే గ్రామంలో ఊరేగించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో సోమవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పందించి 8మంది పై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న నాగేశ్వర్ యాదవ్ తో పాటు వారి కుటుంబంలోని నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బంగారం దొంగలించింది అనే ఆరోపణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు. మహిళపై అమానుషంగా ప్రవర్తించిన కుటుంబంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.






