నా భర్త బికినీ వేసుకుని పో* వీడియోల్లో నటిస్తున్నాడు..డాక్టర్‌పై భార్య ఫిర్యాదు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-23 19:14:43  IST  )

త‌న భ‌ర్త అశ్లీల వీడియోలు తీస్తూ వాటితో డ‌బ్బు సంపాదిస్తున్నాడ‌ని ఓ డాక్ట‌ర్ భార్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. యూపీలోని సంత్ క‌బీర్ న‌గ‌ర్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

నా భర్త బికినీ వేసుకుని పో* వీడియోల్లో నటిస్తున్నాడు..డాక్టర్‌పై భార్య ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: త‌న భ‌ర్త అశ్లీల వీడియోలు తీస్తూ వాటితో డ‌బ్బు సంపాదిస్తున్నాడ‌ని ఓ డాక్ట‌ర్ భార్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. యూపీలోని సంత్ క‌బీర్ న‌గ‌ర్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న భ‌ర్త ప్ర‌భుత్వ వైద్యుడు వరుణేష్ దూబే ట్రాన్స్ జెండ‌ర్ లా న‌టిస్తూ అస‌భ్య‌క‌ర వీడియోలు తీస్తూ వాటిని అన్లైన్‌లో అమ్ముకుని డబ్బులు సంపాదిస్తున్నాడని భార్య సంచలన ఆరోపణలు చేసింది. ఇదేంటని ప్రశ్నిస్తే తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

అంతే కాకుండా ఆ వీడియోలను కూడా తమ ఇంట్లోనే షూట్ చేస్తున్నాడని చెప్పింది. ఇంట్లో బికినీలు వేసుకుంటున్నాడని, తరచూ ఇతర పురుషులతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా వారి ఇంట్లోని ఫర్నిచర్ మరియు వీడియోల్లో కనిపిస్తున్న ఫర్నిచర్ ఇల్లు ఒకేరకంగా ఉన్నాయి. పోలీసులు డాక్టర్ ఇంటిని ఫోటోలు తీసి ఫోరెన్సిక్ నిపుణులకు పంపించారు. దూబే భార్య ఇచ్చిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ బుక్ చేసిన పోలీసులు ఫోరెన్సిక్ వాళ్లు నిర్దారించడంతో డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన యూపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Next Story