- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరిదితో వివాహేతర సంబంధం.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
* రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది * మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ * తెలిసిపోయిందని భర్తను గొడ్డలితో నరికి హత్య

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర జాల్నా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. అతనితో కలిసి భర్తను హతమార్చింది. బాద్నాపూర్ తాలూకా సోమతానా గ్రామానికి చెందిన పరమేశ్వర్ రామ్ తాయిడె, మనీషా తాయిడె భార్యాభర్తలు. ముందుగా వీరి దాంపత్యం బాగానే సాగినా.. పరమేశ్వర్ తమ్ముడు జ్ఞానేశ్వర్ తాయిడె వీరి మధ్యలోకి ఎంటర్ కావడంతో కథ క్రైమ్ స్టోరీగా మారింది. మరిది జ్ఞానేశ్వర్‌పై మనసు పడిన మనీషా అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కానీ ఈ విషయం పరమేశ్వర్‌కు తెలిసిపోయిందని భయపడిపోయారు ఇద్దరు. దీంతో అతన్ని లేపేయాలని ప్లాన్ చేశారు. ఇద్దరు కలిసి గొడ్డలితో నరికి చంపారు.
నవంబర్ 8న ఈ ఘటన జరగ్గా.. ఆ తర్వాత శవాన్ని కాలువ సమీపంలో పడేశారు. అయితే నవంబర్ 12న బాడీ డీకంపోజ్ అయిపోయి స్మెల్ రావడంతో పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. విచారణలో అతన్ని చంపింది తామేనని ఒప్పుకున్నారు ఇద్దరు. దీంతో నవంబర్ 13న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.






