ఏపీలో మరో దారుణం.. అశ్లీల వీడియోలు చూపించి వాచ్ మెన్ అఘాయిత్యం

by Ajay Maddhiboyina |

మహిళా లెక్చరర్ల వేధింపులు తట్టుకోలేక ఏపీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందే రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అలిపిరిలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లో వాచ్ మెన్ వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డుతున్నాడు.

ఏపీలో మరో దారుణం.. అశ్లీల వీడియోలు చూపించి వాచ్ మెన్ అఘాయిత్యం
X

దిశ, వెబ్ డెస్క్: మహిళా లెక్చరర్ల వేధింపులు తట్టుకోలేక ఏపీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందే రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అలిపిరిలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లో వాచ్ మెన్ వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డుతున్నాడు. అర్ధ‌రాత్రి విద్యార్థుల‌ను గ‌దికి పిలిపించుకుని అశ్లీల వీడియోలు చూపిస్తూ అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో ఓ విద్యార్థి త‌ల్లి దండ్రుల‌కు చెప్ప‌గా వాచ్ మెన్ ప్ర‌వ‌ర్త‌న గురించి వార్డెన్ ముని శంక‌ర్ కు ఫిర్యాదు చేశారు.

అంతే కాకుండా త‌ల్లి దండ్రులు అలిపిరి పోలీస్ స్టేష‌న్ లోనూ వాచ్ మెన్ పై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రిపి నింధితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టంతో పాటు పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వరుస దారుణాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల వృద్ధుడు మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అత‌డిని అరెస్ట్ చేయ‌గా ఆత్మ‌హత్య చేసుకున్నాడు. ప్ర‌భుత్వం ఇలాంటి ఘ‌ట‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నా నింధితుల్లో మార్పు రావ‌డం లేదు.

Next Story