డబ్బులు తీసుకుని ఓటేయలేదని గ్రామస్తులపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి

by Ajay Maddhiboyina |

పంచాయితీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. ఓటుకు నోటు ఇవ్వడమే తప్పు అంటే ఓడిపోయిన తరవాత ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలంటే

డబ్బులు తీసుకుని ఓటేయలేదని గ్రామస్తులపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి
X

దిశ‌, వెబ్ డెస్క్: పంచాయితీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. ఓటుకు నోటు ఇవ్వడమే తప్పు అంటే ఓడిపోయిన తరవాత ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలంటే వేధించిన ఘటనలు అనేక చోటు చేసుకున్నాయి. డబ్బులు ఇవ్వకుంటే దేవుడి ఫోటోపై ప్రమాణం చేయాలని అడిగిన ఘటనలు ఉన్నాయి. ఇక తాజాగా ఓ గ్రామంలో పంచాయితీ ఎన్నికల్లో డబ్బు తీసుకుని ఓటు వేయలేదని ఏకంగా దాడులకు పాల్పడ్డారు. ఈ షాకింగ్ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో చోటు చేసుకుంది.

కాగజ్ మద్దూర్ గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తన భార్య రాణిని బరిలో దింపాడు. రాణిపై కాంగ్రెస్ అభ్యర్థి విజయ పోటీ చేసి గెలవగా డబ్బులు తీసుకుని ఓటు వేయలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. మూడు షాపులను ధ్వంసం చేశారు. అంతే కాకుండా గ్రామస్తులు, దళితులపై దాడులకు పాల్పడ్డారు. గ్రామస్తులపై, ఇళ్లపై రాళ్లతో దాడి చేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారం రాత్రి ఈ దాడి జరగటంతో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.

Next Story