- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ ఇన్‌స్పెక్టర్ అక్రమార్జన.. మూడు ఇండ్లు, లగ్జరీ ఫామ్ హౌజ్, 15 ప్లాట్లు, బీరువాల్లో నోట్ల కట్టలు, ఆభరణాలు
మాజీ సీబీసీఐడీ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ వీర్ సింగ్ రాణా ఆస్తులపై దాడులు నిర్వహించింది యూపీ పోలీసుల విజిలెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ టీమ్. సహారన్‌పూర్ బ్రిజేష్ నగర్ కాలనీలో

దిశ, వెబ్ డెస్క్ : మాజీ సీబీసీఐడీ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ వీర్ సింగ్ రాణా ఆస్తులపై దాడులు నిర్వహించింది యూపీ పోలీసుల విజిలెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ టీమ్. సహారన్‌పూర్ బ్రిజేష్ నగర్ కాలనీలో రూ.3.58 కోట్ల విలువచేసే మూడు ఇళ్లు, షేక్ పురా గ్రామంలో రూ. 10.5కోట్ల విలువైన లగ్జరీ ఫామ్ హౌజ్, వివిధ ప్రదేశాల్లో రూ. 3 కోట్ల వాల్యూ చేసే ప్లాట్లు, రెండు లగ్జరీ వాహనాలు గుర్తించారు. 12 బ్యాంక్ ఖాతాల్లో రూ. 1.5 కోట్లతోపాటు బీరువాల్లో నగదు, ఆభరణాలు, బినామీ హోల్డింగ్స్, డాక్యుమెంట్లు కనుగొన్నారు. కాగా క్రైమ్ బ్రాంచ్ సీఐడీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసి రిటైర్ అయిన రాణా.. డోఘట్ తహిసీల్ లోని నిర్పురా గ్రామస్తుల భూములను అక్రమంగా లాక్కున్నట్లు 2021 నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో DSP లెవల్ అధికారుల నేతృత్వంలో విజిలెన్స్ బృందం.. 12 గంటలకు పైగా పలు ప్రదేశాల్లో దాడులు చేసింది. డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ రికార్డులను జప్తు చేసింది. రాణాను విచారణకు హజరు కావాలని సూచించింది.






