నకిరేకల్ పట్టణంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

by Malleboina Mahesh |

నకిరేకల్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని మృతదేహం కనిపించడం కలకలంగా మారింది.

నకిరేకల్ పట్టణంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: నకిరేకల్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని మృతదేహం కనిపించడం కలకలం గా మారింది. పాత ఎస్బిహెచ్ బ్యాంకు ఏటీఎం వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా గుర్తు తెలియని మృతదేహం లభ్యంపై నకిరేకల్ సీఐ వెంకటయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం పద్మ సాయి సూపర్ మార్కెట్ ముందు అనుమానాస్పదంగా మృతి చెందిన గుర్తు తెలియని మృతదేహం లభించింది. అతని వివరాలను ఎవరైనా గుర్తిస్తే వెంటనే 8712577232 అనే నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు. అలాగే ప్రస్తుతం గుర్తు తెలియని మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉందని ఈ సందర్భంగా సీఐ వెంకటయ్య తెలిపారు.

Next Story