- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఇద్దరు కార్మికులు మృతి
డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన సంగారెడ్డిలో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన సంగారెడ్డిలో జరిగింది. సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు ప్రాంతంలో డ్రైనేజీ శుభ్రం చేసేందుకు వెళ్లిన ఇద్దరు యువ కార్మికులు విషవాయువు ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన చోటుచేసుకుంది. కొల్లూరులోని ఓ అపార్ట్‌మెంట్ సమీపంలో డ్రైనేజీ లైన్‌ను శుభ్రం చేయడానికి దిగిన హరీశ్ సింగ్ (25), సోమిత్ (22) అనే కార్మికులు డ్రైనేజీలో ఉన్న మీథేన్, సల్ఫర్ డైఆక్సైడ్ వంటి విషవాయువులు పీల్చడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న తెలుసుకున్న స్థానికులు, అపార్ట్‌మెంట్ నిర్వాహకులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఇద్దరు కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణం అయిన అపార్ట్‌మెంట్ నిర్వాహకులపై, డ్రైనేజీ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






