యువ‌కుడి నిర్ల‌క్ష్య‌పు డ్రైవింగ్ కి ఇద్ద‌రు మ‌హిళ‌లు బ‌లి

by Ratna Kumari |

యువ‌కుడి నిర్ల‌క్ష్య‌పు డ్రైవింగ్ కార‌ణంగా ఇద్ద‌రు మ‌హిళ‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో తీవ్ర విషాదాన్ని నింపింది.

యువ‌కుడి నిర్ల‌క్ష్య‌పు డ్రైవింగ్ కి ఇద్ద‌రు మ‌హిళ‌లు బ‌లి
X

దిశ, గొల్లపల్లి : యువ‌కుడి నిర్ల‌క్ష్య‌పు డ్రైవింగ్ కార‌ణంగా ఇద్ద‌రు మ‌హిళ‌లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్సై కృష్ణ సాగ‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మార్చి 29న గుంజ‌ప‌డుగు గ్రామానికి చెందిన పురాణం ల‌స్మ‌క్క‌, మోతే పోచ‌వ్వ ఇద్ద‌రు మ‌హిళ‌లు జ‌గిత్యాల వెళ్లే క్ర‌మంలో మండ‌ల కేంద్రానికి న‌డుచుకుంటూ వ‌స్తున్నారు. ఇదే క్ర‌మంలో గుంజ‌ప‌డుగు శివారు వ‌ద్ద‌కు వెళ్లే స‌రికి రంగ‌దామునిప‌ల్లి గ్రామానికి చెందిన న‌ర్ర ప‌వ‌న్ అనే యువ‌కుడు గొల్ల‌ప‌ల్లి నుంచి త‌న ఇంటికి బైకు పై వేగంగా వెళ్లుతూ.. ల‌క్ష్మ‌క్క‌, పోచ‌వ్వ‌ల‌ను ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన వారిద్ద‌రు మ‌హిళ‌ల‌ను జ‌గిత్యాల‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో జాయిన్ చేశారు. వారిలో ల‌క్ష్మ‌క్క అదేరోజు చికిత్స పొందుతూ మృతి చెందింది. పోచ‌వ్వ మంగ‌ళ‌వారం రాత్రి మృతి చెందిన‌ట్టు ఎస్సై కృష్ణ‌సాగ‌ర్ తెలిపారు. కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలిపారు.

Next Story