జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్ ‘పింపుల్’.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతం

by Kema Shiva Kumar |

జమ్ముకశ్మీర్‌ (Jammu Kashmir)లోని కుప్వారా (Kupwara) జిల్లా కేరన్ సెక్టర్‌లో శనివారం భద్రతా బలగాలు ఉగ్రమూకల దాడిని అడ్డుకుని ఇద్దరు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాయి.

జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్ ‘పింపుల్’.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతం
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్‌ (Jammu Kashmir)లోని కుప్వారా (Kupwara) జిల్లా కేరన్ సెక్టర్‌లో శనివారం భద్రతా బలగాలు ఉగ్రమూకల దాడిని అడ్డుకుని ఇద్దరు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాయి. ఆర్మీ వైట్ చినార్ కార్ప్స్ (Chinar Corps) ఇవాళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. శుక్రవారం పక్కా సమాచారం మేరకు ‘ఆపరేషన్ పింపుల్’ ప్రారంభించామని తెలిపింది. ఉగ్రవాదులను గుర్తించి వారిని చుట్టుముట్టామని, అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు చినార్ కార్ప్స్ టీమ్ ప్రకటించింది. అయితే, కేరన్ సెక్టర్‌లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా సమాచారం.

Next Story