- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహబూబాబాద్ జిల్లాలో పిడుగుల బీభత్సం..ఇద్దరు మృతి
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అంతే కాకుండా వర్షంతో పాటూ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. దీంతో జిల్లాలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ఇద్దరు మరణించారు.
వారిలో ఒకరు గూడూరు మండలం గుండెంగలో పంచాయితీ ఉద్యోగి ప్రభు కాగా మరొకరు ఓటాయి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి చేరాలు మృతి చెందాడు. మరోవైపు అకాల వర్షాలతో జిల్లాలో ధాన్యం సైతం తడిసిపోయింది దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.






