ఐఈడి పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

by Kodari Anjali |

మావోయిస్టులు అమర్చిన ఐఈడి బాంబు పేలి ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.

ఐఈడి పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు
X

దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: మావోయిస్టులు అమర్చిన ఐఈడి బాంబు పేలి ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఛత్తిస్ ఘడ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా కోయంబెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం ఉదయం పోలీసుల బృందం గస్తీ చేస్తూ కాగ్బరస్ ప్రాంతానికి రాగానే రోడ్డు పక్కన ఉన్న నాలాలో మావోయిస్టులు అమర్చిన బాంబు పేలింది. దీంట్లో ఇద్దరు జవాన్లకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.

Next Story