నెల్లూరులో రెచ్చిపోయిన ట్రాన్స్ జెండర్లు.. షాకింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

నెల్లూరు జిల్లాలో ట్రాన్ జెంట‌ర్లు రెచ్చిపోయారు. మ‌ద్యం మ‌త్తులో హాస్పిట‌ల్ లో ప‌నిచేస్తున్న న‌ర్సును బ‌య‌ట‌కు లాకొచ్చి ఆమెపై దాడి చేశారు. ఈ ఘ‌ట‌న కందుకూరులో చోటు చేసుకుంది.

నెల్లూరులో రెచ్చిపోయిన ట్రాన్స్ జెండర్లు.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో ట్రాన్ జెంట‌ర్లు రెచ్చిపోయారు. మ‌ద్యం మ‌త్తులో హాస్పిట‌ల్ లో ప‌నిచేస్తున్న న‌ర్సును బ‌య‌ట‌కు లాకొచ్చి ఆమెపై దాడి చేశారు. ఈ ఘ‌ట‌న కందుకూరులో చోటు చేసుకుంది. ఓ ఆస్ప‌త్రికి వెళ్లిన ముగ్గురు ట్రాన్స్ జెంట‌ర్లు అక్క‌డ ప‌నిచేస్తున్న న‌ర్సును మామూలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. కానీ అడిగినంత ఇవ్వ‌క‌పోవ‌డంతో వాగ్వాదానికి దిగారు. ఫైల్స్ తీసుకుని కింద విసిరేశారు.

ఆస్ప‌త్రిలో వీరంగం సృష్టించారు. న‌ర్సు ప‌లుమార్లు త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఆమెపై దాడి చేశారు. చివ‌రికి జుట్టు ప‌ట్టుకుని బ‌య‌ట‌కు తీసుకువెళ్లి దాడి చేశారు. న‌ర్సు దుస్తులను సైతం చింపేస్తూ హ‌ల్ చ‌ల్ చేశారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. హిజ్రాల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వారి ఆగ‌డాలు పెరిగిపోయాయ‌ని స్థానికులు సైతం మండిప‌డుతున్నారు. video

Next Story