- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.1500 తీసుకుని మోసం చేశాడని యువకుడిపై ట్రాన్స్ జెండర్ దాడి
రూ.1500 తీసుకుని తనను మోసం చేశాడు అంటూ ఓ ట్రాన్స్ జెండర్ ఆలయ ఉద్యోగిపై దాడికి పాల్పడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా జొన్నవాడలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: రూ.1500 తీసుకుని తనను మోసం చేశాడు అంటూ ఓ ట్రాన్స్ జెండర్ ఆలయ ఉద్యోగిపై దాడికి పాల్పడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా జొన్నవాడలో చోటు చేసుకుంది. ఆలయంలో పనిచేసే ఓ కుర్రాడు ఇన్ స్టాగ్రామ్ లో స్థానిక హిజ్రాకు ఫేక్ అకౌంట్ తో సందేశాలు పంపాడు. తాను తిరుపతిలో పోలీస్ అధికారిని అని చెప్పాడు. నువ్వు అందంగా ఉన్నావ్ నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ నమ్మించాడు.
దీంతో తనకు రూ.1500 అత్యవసరంగా కావాలని రాత్రి వరకు రెండు వేలు తిరిగి పంపిస్తానని చెప్పాడు. అతడిని నమ్మి 1500 పంపగా తిరిగి పంపలేదు. తాను మోసపోయానని గ్రహించిన ట్రాన్స్ జెండర్ అతడు ఆలయంలో పనిచేసే కుర్రాడు అని తెలుసుకుని ఆలయం వద్దకు వచ్చి చితకబాదింది. తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని గొడవ చేసింది. మరొకరిని ఇలా మోసం చేయవద్దని హెచ్చరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






