- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి
సంతోషంగా బడికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను రైలు ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్ డెస్క్: సంతోషంగా బడికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను రైలు ఢీ కొట్టడం (Train collision)తో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఢిల్లీలోని నాంగ్లోయ్‌లో రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ రోజు ఉదయం నాంగ్లోయ్‌లో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న విద్యార్థులు పాఠశాలకు వెళ్లే క్రమంలో రైలు పట్టాలు దాటుతున్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన రైలు విద్యార్థులను ఢీకొట్టింది. దీంతో వారు 10 మీటర్ల దూరంలో ఎగిరపడటంతో.. ఆ పసి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ఇది గమనించిన స్థానికులు రైల్వే ట్రాక్ పై వందల సంఖ్యలో చేరుకున్నారు. పిల్లలు మరణించిన ఘటనపై ఔటర్ ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ మాట్లాడుతూ.. "రైలు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మరణించారని మాకు సమాచారం అందింది. స్థానికులు రైల్వే ట్రాకులపై గుమిగూడంతో పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం రైలు కార్యకలాపాలు సజావుగా నడుస్తున్నాయి. పరిస్థితి సాధారణంగా ఉంది" అని ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు. ఈ విషాద ఘటనతో ఇద్దరు పిల్లల కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి.






