- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండుగ వేళ కొల్లాపూర్ లో విషాదం.. ఇద్దరు బాలికలు మృతి
పండుగ వేళ కొల్లాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన ఇద్దరు అమ్మాయిలు బావిలో పడి శవాలుగా మారారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.

దిశ, కొల్లాపూర్ : పండుగ వేళ కొల్లాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన ఇద్దరు అమ్మాయిలు బావిలో పడి శవాలుగా మారారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్ పట్టణంలో హిందు శ్మశాన వాటిక సమీపంలో ఓ వ్యవసాయ బావి ఉంది. అయితే ఆ బావిలోకి ఇద్దరు బాలికలు కొల్లాపూర్ పట్టణంలోని చుక్కాయపల్లి కాలనీకి చెందిన వీరపాగ రాముడు కూతురు వరలక్ష్మి(18),, మొలచింతపల్లి గ్రామానికి చెందిన గోదా నర్సింహా కూతురు లావణ్య (12) బట్టలు ఉతికేందుకు వెళ్లారు. వీరిద్దరికి ఈత రాకపోవడం గమనార్హం. మంగళవారం మధ్యాహ్నం బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బండారు సురేష్ ఘటన స్థలానికి చేరుకొని బుధవారం సాయంత్రం మృతదేహాలను బయటికి తీయించి పోస్టుమార్టం కోసం తరలించారు. 2021లో కరోనాతో లావణ్య తండ్రి నర్సింహా మరణించాడు. దీంతో కూతురు లావణ్యతో కలిసి కలిసి తల్లి కొల్లాపూర్ పట్టణంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. కూలీ పనులు చేస్తూ కూతురుని పోషించుకుంటూ జీవిస్తోంది. మృతదేహాలు లభ్యమయ్యాయని తెలియగానే వెంటనే డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, సీఐ మహేష్ లు మృతదేహాలను పరిశీలించారు. వరలక్ష్మీ తండ్రి రాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.






