అదుపుతప్పి బొలెరో ట్రక్ బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం

by Naga Rani Yarlagadda |

ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నందిగామ క్రాస్ రోడ్డు వద్ద బొలెరో అదుపుతప్పి బోల్తా పడింది.

అదుపుతప్పి బొలెరో ట్రక్ బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ క్రాస్ రోడ్డు వద్ద 20 మంది మత్స్యకారులతో నర్సాపురం నుంచి సత్తెనపల్లికి బొలెరో ట్రక్ వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కులో ఉన్న మత్స్యకారులంతా దమ్మాలపాడు గ్రామంలోని చెరువులో రొయ్యలు పట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 15 మంది గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. మరోవైపు ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అద్దంకి మండలం ధర్మవరంలో రైస్ మిల్లు వద్ద కోటిరెడ్డి (46) అనే వ్యక్తి గత రాత్రి హత్య చేయబడ్డాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన RMP డాక్టర్ గా గుర్తించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story