Tragedy: బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి.. రైలు కిందపడి బలవన్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-06 05:42:34  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ (Betting) భూతం పంజా విసురుతోంది.

Tragedy: బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి.. రైలు కిందపడి బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ (Betting) భూతం పంజా విసురుతోంది. జూదానికి అలవాటు పడి రూ.లక్షల కొద్దీ అప్పుల చేసి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో యువత వరుసగా ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. కన్నవారికి తోడుగా ఉండాల్సిన వారు చిన్నవయసులోనే కాటికి కాళ్లుచాపుతూ.. వారికి తీరని శోకం మిగుల్చుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి బెట్టింగ్‌ కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సుచిత్ర (Suchithra)లోని బీహెచ్ఈఎల్ కార్టర్స్‌ (BHEL Carters)లో నివాసం ఉంటున్న రాజ్‌వీర్ సింగ్ ఠాకూర్ (Rajveer Singh Thakur) నిత్యం ఆన్‌లైన్ బెట్టింగ్‌ (Online Betting)‌లో డబ్బులు పెట్టేవాడు. ఈ మధ్య తన వద్ద ఉన్న డబ్బుతో పాటు అప్పు చేసి తెచ్చిన మొత్తం కూడా ఆ బెట్టింగ్‌లో పొగొట్టుకున్నాడు. దీంతో పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిన రాజ్‌వీర్ సింగ్ ఠాకూర్ శనివారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ వద్దకు వెళ్లి ట్రైన్ కిందపడి బవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story