Tragedy: ప్రాణం తీసిన వివాహేతర బంధం.. ప్రియుడే కాలయముడై..

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-03 04:09:40  IST  )

పచ్చని కాపురంలో వివాహేతర బంధం నిప్పులు పోసిన ఘటన కృష్ణా జిల్లా (Krishna District)లోని నిడమానూరు (Nidamanur)లో చోటుచేసుకుంది.

Tragedy: ప్రాణం తీసిన వివాహేతర బంధం.. ప్రియుడే కాలయముడై..
X

దిశ, వెబ్‌డెస్క్: పచ్చని కాపురంలో వివాహేతర బంధం నిప్పులు పోసిన ఘటన కృష్ణా జిల్లా (Krishna District)లోని నిడమానూరు (Nidamanur)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిడమానూరు ప్రాంతంలో ప్రకాశ్ (Prakash), కావ్య (Kavya) దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, కావ్య కుటుంబం గడవడం కోసం సమీపంలో ఉన్న రెయిన్‌బో ఆసుపత్రి (Rainbow Hospital)లో ఆయాగా విధుల్లో చేరింది. ఈ క్రమంలోనే ఆమెకు అక్కడ పని చేస్తున్న వాసు (Vasu) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. గత కొంతకాలంగా ఇద్దరూ నిత్యం ఫోన్‌లో గంటలు గంటలు మాట్లాడుకునే వారు. అప్పడప్పుడు బయట కూడా కలుస్తుండే వారు.

అయితే, విషయం తెలుసుకున్న కావ్య భర్త ప్రకాశ్ (Prakash) ఆమెను ఉద్యోగం మాన్పించాడు. ఆమెను నుంచి సెల్‌ఫోన్ (Cell Phone) తీసుకుని ఇంట్లో పనులు చూసుకోవాలని మందలించాడు. దీంతో కొన్నాళ్లుగా కావ్య ఇంట్లోనే ఉంటుంది. అయితే, ఫోన్ చేసినా.. కావ్య తనతో మాట్లాడటం లేదంటూ ప్రియుడు వాసు ఆమెపై విపరీతంగా కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కావ్య ఇంటికి వెళ్లి ఆమె మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పటమట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం వారు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Next Story