- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి
by Ratna Kumari |
దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ కు చెందిన గడ్డం జితేందర్ (30 )ట్రాక్టర్ నడుపుతూ ఉండగా.. వెనకున్న కేజీవీల్ ఊడిపోవడంతో ట్రాక్టర్ బోల్తా పడి

X
దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ కు చెందిన గడ్డం జితేందర్ (30 )ట్రాక్టర్ నడుపుతూ ఉండగా.. వెనకున్న కేజీవీల్ ఊడిపోవడంతో ట్రాక్టర్ బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ కి చెందిన సంధవేణి శ్రీనివాస్ కు చెందిన ట్రాక్టర్ గడ్డం జితేందర్ అనే వ్యక్తి నడుపుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో జితేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. జితేందర్ మరణంతో వెంకటాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన స్థలాన్ని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






