అదుపుత‌ప్పి కాలువ‌లోకి దూసుకెళ్లిన ట్రాక్ట‌ర్.. డ్రైవ‌ర్ మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, అనంత‌గిరి : అదుపు తప్పి ట్రాక్టర్ పంట కాలవలోకి దూసుకెళ్ల‌డంతో డ్రైవర్ మృతి చెందగా.. మరొకరికి గాయాలైన సంఘటన అనంతగిరి మండలం పాలవరం గ్రామ శివారులో చోటు చేసుకుంది.

అదుపుత‌ప్పి కాలువ‌లోకి దూసుకెళ్లిన ట్రాక్ట‌ర్.. డ్రైవ‌ర్ మృతి
X

దిశ‌, అనంత‌గిరి : అదుపు తప్పి ట్రాక్టర్ పంట కాలవలోకి దూసుకెళ్ల‌డంతో డ్రైవర్ మృతి చెందగా.. మరొకరికి గాయాలైన సంఘటన అనంతగిరి మండలం పాలవరం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాలారం తండా గ్రామానికి చెందిన భూక్యా నాగరాజు (42), పాలారం గ్రామానికి చెందిన మట్టపల్లి కోటయ్య వద్ద సంవత్సరం జీతం వారిగా పని చేస్తున్నాడు. అందులో భాగంగా వారి ట్రాక్టర్ డ్రైవింగ్ కూడా చేసేవాడు. ఇదే క్రమంలో మంగళవారం సాయంత్రం నాగరాజు, జీడయ్య ఇరువురు కలిసి కిష్టాపురం గ్రామ శివారులోని జీడయ్య పొలంలో కోసిన సుమారు 8 బస్తాల వడ్లని ట్రాక్టర్ ట్రాలీలో లోడ్ చేసుకొని తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో అకస్మాత్తుగా ట్రాక్టర్ ఇంజన్ హెడ్ లైట్లు వెలగకపోవడంతో నాగరాజు తన సెల్ ఫోన్ లైట్ సహాయంతో ఆ ట్రాక్టర్ ను ఒంటి చేతితో నడుపుకుంటూ వస్తున్నాడు. పాలారం గ్రామ శివారులోని స్మశాన వాటిక వద్దకు వచ్చేసరికి రోడ్డుపైన ఆరబోసిన ఒడ్లు సెల్ ఫోన్ వెలుతురుకు సరిగా కనబడక ట్రాక్టర్ ఎడమచక్రం ధాన్యం పైకి ఎక్కి ఒకేసారిగా అదుపుతప్పి కుడివైపున గల పంట కాలువలో పడిపోయింది. దీంతో నాగరాజు రెండు చేతులకు, ఛాతికి గాయాలయ్యాయి. జీడయ్య కు కూడా గాయాలు అయ్యాయి. వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి నాగరాజు మరణించినట్లుగా తెలిపారు. గాయపడిన జీడయ్య చికిత్స పొందుతున్నాడు. నాగరాజు భార్య భూక్య దుర్గా బాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా అనంతగిరి ఎస్సై ఎం. నవీన్ కుమార్ వెల్ల‌డించారు.

Next Story