తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

by Disha Web Desk 13 |
తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
X

దిశ, ప్రతినిధి మెదక్: నర్సాపూర్‌లో వరస దొంగతనాలకు పాల్పడుతున్న బీదర్‌కు చెందిన వారిని అరెస్ట్ చేసి వారి వద్ద ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు. సోమవారం మెదక్ ఏఆర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. నర్సాపూర్‌లో గత కొంత కాలంగా 11 దొంగతనాలు వరసగా జరిగాయి. ఒక కేసులు లభించిన క్లూ ఆధారంగా విచారించగా బీదర్ కు చెందిన ఆకాష్ కాంబ్లీ, సురేష్ కాంబ్లీ తో వికాస్ కాంబ్లీ ఉన్నట్లు గుర్తించారు. వారు అర్ధ రాత్రి 11 గంటలకు తాళం వేసిన ఇల్లు టార్గెట్ చేసి దిచుకెల్లుతున్నరు.


ఇందులో భాగంగా నర్సాపూర్ పట్టణంలో 11 ఇళ్లలో చోరీ చేశారు. వారిలో ఆకాష్, సురేష్ లను పట్టుకొని వారి వద్ద 6 తులాల బంగారం, 1.6 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వికాస్ ఇంకా దొరకలేదని, ఇద్దరిని మాత్రం రిమాండ్ చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. గతంలో కూడా వీరి పై బాన్స్ వాడ లో గతంలో కేసులు ఉన్నాయని, వేరు బీదర్ లో కూడా చోరీకి పాల్పడినట్లు తెలిపారు. ఈ చోరీ కేసును ఛేదించడంలో పోలీస్ పని తీరును ఎస్పీ ప్రశంసించారు. రివార్డులు కూడా అందజేశారు. ఈ సమావేశంలో ఎస్పీ బాల స్వామి, డీఎస్పీ యాదవరెడ్డి, సీఐ లు షేక్ మధార్, చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed