- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాత్రికుల బస్సుకు ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
by Malleboina Mahesh |
నెల్లూరు జిల్లా నుంచి కాశీ వెళ్తున్న యాత్రికుల బస్సును బిహార్‌లోని బౌరంగాబాద్ వద్ద లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

X
దిశ, వెబ్ డెస్క్: యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఔరంగబాద్ వద్ద యాత్రికులతో వెళ్తున్న బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 3 ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 43 మంది యాత్రికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ యాత్రికులు బస్సు ఈ నెల 1న నెల్లూరు నుంచి కాశీ యాత్రకు బయలుదేరినట్లు అధికారులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు సంగం, ఒక మహిళ ఆత్మకూర్ కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






