టెంప్ట్ చేసిందని బట్టలన్నీ విప్పేశాడు.. ఆ కాల్ కట్ అవ్వగానే.. మరో వీడియో కాల్

by Gantepaka Srikanth |

టెంప్ట్ చేసిందని బట్టలన్నీ విప్పేశాడు.. ఆ కాల్ కట్ అవ్వగానే.. మరో వీడియో కాల్

టెంప్ట్ చేసిందని బట్టలన్నీ విప్పేశాడు.. ఆ కాల్ కట్ అవ్వగానే.. మరో వీడియో కాల్
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూడ్ వీడియో కాల్స్(Nude Video Call) చేసి ఓ యువకుడిని సైబర్ ముఠా నిండా ముంచింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.3.41 లక్షలు కాజేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని గౌలిగూడ(Gauliguda) ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గౌలిగూడకు చెందిన ఓ యువకుడికి.. గుర్తు తెలియని యువతి ఇటీవల వాట్సాప్‌లో వీడియో కాల్ చేసింది. జ్యోతిగుప్తా అనే పేరుతో యువకుడిని పరిచయం చేసుకున్నది. అలాగే రోజూ మాట్లాడుతూ క్లోజ్ అయింది. ఈ క్రమంలోనే న్యూడ్ వీడియో కాల్ చేసి టెంప్ట్ చేసింది. యువకుడిని కూడా న్యూడ్‌గా చేసి వీడియో కాల్ రికార్డ్ చేసింది. ఈ కాల్ అనంతరం యువకుడికి మరో వీడియో కాల్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే.. సైబర్ నేరగాళ్లు ప్రత్యక్షమయ్యారు. పోలీసు దుస్తుల్లో కనిపించి బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకపోతే రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో, మీ బంధువుల వాట్సాప్ గ్రూపుల్లో పెడతామని బెదిరించారు. ఇలా ఆ యువకుడి నుంచి రూ.3.41 లక్షల వరకూ బదిలీ చేయించుకున్నారు. ఆ వీడియో చూపించి మళ్లీ మళ్లీ బెదిరింపులకు పాల్పడటంతో చేసేదేం లేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం నలుగురు దుండగులను అరెస్ట్ చేశారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story