- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంథనిలో దొంగలు హల్ చల్.. వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలు
మంథనిలో వరుస దొంగతనాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. గద్దలపల్లి (ధర్మారం) గ్రామానికి చెందిన వృద్ధురాలు కందుకూరి లక్ష్మిభాయ్ (62) ఇంట్లో బుధవారం దొంగలు చోరికి పాల్పడి రెండు తులాల బంగారు మెడతాడు ఎత్తుకెళ్లిన ఘటన మరువకముందే, మరో చోరీ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ,మంథని : మంథనిలో వరుస దొంగతనాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. గద్దలపల్లి (ధర్మారం) గ్రామానికి చెందిన వృద్ధురాలు కందుకూరి లక్ష్మిభాయ్ (62) ఇంట్లో బుధవారం దొంగలు చోరికి పాల్పడి రెండు తులాల బంగారు మెడతాడు ఎత్తుకెళ్లిన ఘటన మరువకముందే, మరో చోరీ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంథని పట్టణానికి చెందిన ఇల్లందుల వెంకటేశ్వర్లు ఈ నెల 22న కుటుంబంతో కలిసి పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు.
సోమవారం రాత్రి తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో టీవీ, ల్యాప్‌టాప్, ట్యాబ్, వెండి వస్తువులు, రూ. 20 వేల నగదు చోరీకి గురయ్యాయని గమనించాడు. మొత్తం దొంగలు ఎత్తుకెళ్లిన వస్తువుల విలువ సుమారుగా రూ. 95 వేలుగా ఉంటుందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మంథని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి దొంగతనం ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






