- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
రామకృష్ణాపూర్ పట్టణంలో చోరీ..
by Disha Web |

X
దిశ, రామకృష్ణాపూర్ : పురపాలక సంఘం రామకృష్ణాపూర్ భగత్ సింగ్ నగర్ ఏరియాలో శనివారం చోరీ ఘటన వెలుగు చూసింది. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఉచ్చుల అఖిల భర్త యుగేందర్ న్యాయవాది ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. తన భర్త దిన కర్మ శుక్రవారం ముగించుకొని రాత్రి సమీప బంధువుల ఇంట్లో నిద్రచేసి శనివారం ఉదయం ఇంటి వెళ్లి చూడగా బీరువాలోని సుమారు రూ.3 లక్షల నగదు, 7 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు తెలిపారు.
రామకృష్ణాపూర్ పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సై అశోక్ లు ఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు పట్టణ ఎస్సై అశోక్ తెలిపారు.
Next Story