- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్ వివాదం.. హత్యాయత్నానికి దారి..
సెల్ ఫోన్ వివాదం హత్యయత్నానికి దారి తీసిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్ డౌన్ ఏరియాలో గురువారం జరిగింది.

దిశ, గోదావరిఖని : సెల్ ఫోన్ వివాదం హత్యయత్నానికి దారి తీసిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్ డౌన్ ఏరియాలో గురువారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే వెంకటరమణ, అతని మిత్రుడు అన్వర్ కలిసి ఉండగా ఆ ఇద్దరి మిత్రుడు అవినాష్ తన సెల్ ఫోన్ ను విక్రయించేందుకు అక్కడికి వచ్చాడు. కాగా వెంకటరమణ ఫోన్ ను కొనుగోలు చేశాడు. దీంతో మిగిలిన ఇద్దరు మిత్రులు వెంకటరమణను పార్టీ అడగడంతో ముగ్గురు మద్యం సేవించారు.
అనంతరం అవినాష్ ఓ మహిళను అనుచితంగా వ్యాఖ్యానించడంతో గొడవ జరిగింది. ఈ గొడవలో వెంకటరమణ పై అవినాష్ పదునైన ఆయుధంతో మెడ భాగంలో పొడిచి, పరారయ్యాడు. వెంటనే వెంకటరమణ తన స్నేహితుడు అన్వర్ తో కలిసి కారులో మార్కండేయ కాలనీకి చేరుకున్నారు. కాగా అక్కడ ప్రమాదవశాత్తు కారు డివైడర్ కు ఢీకొని అక్కడే ఉండిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వెంకటరమణను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వన్ టౌన్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






