పెళ్లి ఆగిపోవడంతో యువకుడు ఆత్మహత్య...!

by Ratna Kumari |

పెళ్లి ఆగిందని మనస్థాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జోగులంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

పెళ్లి ఆగిపోవడంతో యువకుడు ఆత్మహత్య...!
X

దిశ, అలంపూర్ : పెళ్లి ఆగిందని మనస్థాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జోగులంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మానవపాడు మండల కేంద్రానికి చెందిన వసంతకళ్యాణ్ రెడ్డి (33) మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. జనవరి 15న గురువారం వివాహం తిరుపతి ఆలయంలో జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల పెళ్లి ఆగిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వసంత కళ్యాణ్ రెడ్డి నిన్న ఉదయమే తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుడికి వెళ్లి వచ్చిన తల్లి ఈశ్వరమ్మ, అపస్మారక స్థితిలో ఉన్న కొడుకును వెంటనే 108 అంబులెన్స్ లో అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.స్వాతి తెలిపారు. వసంత కళ్యాణ్ రెడ్డి మృతితో మానవపాడు గ్రామంలో విషాదం నెలకొంది.

Next Story