- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపిన భార్య
అక్రమ సంబంధానికి తరచూ అడ్డు వస్తున్నాడనే నెపంతో భర్తను ప్రియుడితో కలిసి భార్య అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మండలంలోని సీత్యా తండాలో బుధవారం చోటుచేసుకుంది.

దిశ, మాడ్గులపల్లి : అక్రమ సంబంధానికి తరచూ అడ్డు వస్తున్నాడనే నెపంతో భర్తను ప్రియుడితో కలిసి భార్య అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మండలంలోని సీత్యా తండాలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సీత్యా తండ గ్రామానికి చెందిన రమావత్ రవి, లక్ష్మి దంపతులు కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కలరు. రవి గ్రామ సమీపంలోని సల్కునూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పని చేస్తుండేవాడు. తన భార్య లక్ష్మి గృహిణి గా ఇంటి వద్ద ఉండేది. లక్ష్మి తన సమీప బంధువైన వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగించినట్టు భర్తకు తెలిసిందే. దీంతో అదే అనుమానంతో ఏడాది కాలంగా తరచూ వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని గ్రామస్తులు తెలిపారు. భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని ప్రియుడితో కలిసి హత్య చేసేందుకు పన్నాగం పన్నింది లక్ష్మీ. బుధవారం తెల్లవారుజామున తన ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా తల ఛాతిపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మంచంపై మృతి చెందాడు. వెంటనే ఆమె మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులు ఎదుట తన భర్తను చంపాను అనే నేరం ఒప్పుకొని లొంగిపోయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్నిసీత్య తండా గ్రామానికి దగ్గరలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి ఉండగా నల్లగొండ ఆసుపత్రికి ఎందుకు తరలించారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ ప్రియుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం..? రవి హత్య విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.






