- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త టార్చర్ చేస్తుండని పుట్టింటికి వెళ్తే.. అక్కడికీ వచ్చి మామను చంపిన అల్లుడు
భర్త టార్చర్ చేస్తుండని పుట్టింటికి వెళ్తే.. అక్కడికీ వచ్చి మామను చంపిన అల్లుడు

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి(Sangareddy) జిల్లా బీరంగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సొంత మామను అల్లుడు కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళితే.. మద్యానికి బానిసైన రామకృష్ణ అనే వ్యక్తి.. భార్య లక్ష్మితో గొడవలు పడుతున్నారు. రోజు రాత్రి వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. భర్త వేధింపులు భరించలేక ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో ఇవాళ కూడా మద్యం సేవించిన రామకృష్ణ భార్య పుట్టింటికి వెళ్లి మళ్లీ గొడవ పడ్డాడు. నా భార్యను నాతో పంపించండి అని రచ్చ చేశాడు. దీనికి మామ చంద్రయ్య నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆవేశం ఆపుకోలేకపోయిన రామకృష్ణ ఇంట్లో కత్తి తీసి మామ చంద్రయ్యపై కిరాతకంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన చంద్రయ్య మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






