Crime News:లవర్‌తో ఆ పని చేయెద్దన్న తమ్ముడు.. అక్క ఏం చేసిందంటే..

by Chukka Sudharani |   (  Updated:2022-09-13 13:26:52  IST  )

రక్తం పంచుకుని పుట్టాడు. తన కంటే వయసులో చిన్నవాడు. ఆ తమ్ముడు అంటే అక్కకు ఎంత ప్రేమో.

Crime News:లవర్‌తో ఆ పని చేయెద్దన్న తమ్ముడు.. అక్క ఏం చేసిందంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: రక్తం పంచుకుని పుట్టాడు. తన కంటే వయసులో చిన్నవాడు. ఆ తమ్ముడు అంటే అక్కకు ఎంత ప్రేమో. కానీ, తన ప్రేమ విషయంలో అభ్యంతరం తెలిపాడని తమ్ముడి మీద కోపం పెంచుకుంది. విచక్షణ మరిచి తమ్ముడిని హతమార్చింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

రామ్ గఢ్ జిల్లాకు చెందిన చంచల కుమారి (25) ఓ థర్మల పవర్ స్టేషన్‌లో పని చేస్తోంది. ఆ పవర్ స్టేషన్‌కు సంబంధించిన క్వార్టర్స్‌లోనే నివసిస్తోంది. కుమారికి రోహిత్ కుమార్ (21) అనే తమ్ముడు ఉన్నాడు. అయితే కొంత కాలం క్రితం కుమారికి సోను అన్సారీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇక అది కాస్త ప్రేమగా మరి ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. ఈ సంగతి తెలిసి రోహిత్ అక్కను నిలదీయగా.. తన ప్రియుడని, అతని పేరు సోను అన్సారీ అని తెలిపింది. అయితే.. ఆ వ్యక్తి తమ కులం వాడు కాకపోవడంతో, ఈ సంబంధాన్ని రోహిత్ వ్యతిరేకించాడు. అతడితో తిరగడం మానకపోతే తల్లిదండ్రులకు చెప్పేస్తానని బెదిరించాడు.

దీంతో తమ్ముడుపై కోపం పెంచుకుంది అక్క. తన ప్రేమకు అడ్డువస్తున్న రోహిత్‌ను ఎలా అయినా అడ్డుతొలగించుకోవాలి అనుకుంది. ప్రియుడు అన్సారీతో కలిసి హత్యకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం.. ఒక రోజు చంచల తన తమ్ముడిని క్వార్టర్స్‌లోని ఓ రహస్య ప్రాంతానికి పిలిచింది. అక్క పిలుపు మేరకు అక్కడకు వెళ్లాడు రోహిత్. ఆల్రెడీ అక్కడ కాచుకూర్చున్న సోను అన్సారీ.. రోహిత్ రాగానే అతనిపై దాడి చేశాడు. చంచల, సోను కలిసి అతడ్ని హతమార్చారు. ఎవ్వరికి అనుమానం రాకుండా క్వార్టర్స్‌లోనే మృతదేహాన్ని దాచారు. అనంతరం ఏమీతెలియనట్టుగా చంచల కుమారి ఇంటికి వెళ్లింది. తమ కుమారుడు ఇంటికి రాలేదు. ఆచూకీ కూడా తెలియడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే చంచల క్వర్టర్స్‌లో రోహిత్ మృతదేహాన్ని లభించింది. దీంతో చంచలపై అనుమానం వచ్చింది. పోలీసులు తమదైన శైలీలో ప్రశ్నించగా.. తన ప్రేమకు అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి తమ్ముడిని హతమార్చినట్టు ఒప్పుకుంది. దీంతో చంచల కుమారి, సోను అన్సారీని అరెస్టు చేసి.. దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు.

Next Story