- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముళ్ల పొదల్లో పడేసిన పసికందును కుక్కలు దారుణంగా...
by Taduka Kalyani |
సంతానం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారు కొందరైతే, ఆ వరాన్ని కాలుదన్నుకునేవారు మరికొందరు.

X
దిశ, మరికల్: సంతానం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారు కొందరైతే, ఆ వరాన్ని కాలుదన్నుకునేవారు మరికొందరు. ఏ జరిగిందో ఏమో గానీ ఏ పాపమెరుగని అప్పుడే పుట్టిన పసికందును మంగళవారం మరికల్ మండల కేంద్రంలోని కంకల్ చెరువు కట్టపై ఉన్న ముళ్ళ పొదల్లో పడేశారు. ఆ శిశువును ఊర కుక్కలు, పందులు తింటున్న విషయాన్ని గుర్తించిన స్థానిక గ్రామపంచాయతీ కార్మికులు పోలీసులకు సమాచారం అందజేశారు.
వెంటనే పోలీసులు స్పందించి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇది ఇలా ఉండగా బతికి ఉండగానే శిశువును ముళ్ల పొదల్లో పడేసి ఉంటారని, కుక్కలు పందులు పీక్కడంతో శిశువు మృతి చెంది ఉంటుందని పంచాయతి కార్మికులు అనుమానం వ్యక్తం చేశారు.
Next Story






