- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లి మందలించిందని తనువు చాలించిన కూతురు..
by Taduka Kalyani |
తల్లి మందలించిందని మనస్థాపం చెందిన కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో జరిగింది.

X
దిశ, మానవపాడు: తల్లి మందలించిందని మనస్థాపం చెందిన కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన గౌస్, మణెమ్మల కూతురు ఐశ్వర్య మానవపాడు ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ఈ నెలలో వార్షిక పరీక్షలు ఉండడంతో బాగా చదువుకోవాలని, సెల్ ఫోన్ అతిగా చూడొద్దని తల్లి మణెమ్మ ఐశ్వర్యను మందలించింది.
దీంతో మనస్థాపం చెందిన ఐశ్వర్య ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో చికిత్స నిమిత్తం ఐశ్వర్యను కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందింది. తల్లి మణెమ్మ ఫిర్యాదు మేరకు మానవపాడు పోలీస్టేషన్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






