రక్తపుమడుగులో యువతి.. తాళికట్టిన ప్రేమోన్మాది

by Naga Rani Yarlagadda |

కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

రక్తపుమడుగులో యువతి.. తాళికట్టిన ప్రేమోన్మాది
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పాండవపుర ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల పూర్ణిమ అనే మహిళను వేధిస్తున్న యువకుడు కత్తితో దారుణంగా హతమార్చాడు. మైసూరులో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పూర్ణిమను క్యాతనహళ్లికి చెందిన అభిషేక్ అనే 30 ఏళ్ల యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

గత శుక్రవారం పాఠశాల నుంచి ఇంటికి తిరుగుతున్న సమయంలో పూర్ణిమను ఎదుర్కొన్న అభిషేక్, పెళ్లి చేసుకోవాలని మరోసారి ఒత్తిడి చేశాడు. ఆమె తిరస్కరించడంతో కత్తితో పలు ప్రదేశాల్లో గాయాలు చేశాడు. గాయాలతో పోరాడుతున్న పూర్ణిమ మెడలో అభిషేక్ బలవంతంగా తాళి కట్టి సెల్ఫీ తీసుకున్నాడు.

తర్వాత ఆమెను మైసూరులోని ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. కానీ శనివారం ఉదయం పూర్ణిమ మృతి చెందారు. అనంతరం పరారైన అభిషేక్‌ను పోలీసులు అదే రోజు సాయంత్రం అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటనపై మైసూరు లక్ష్మీపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Next Story