"నీ డ్రెస్ బాగుంది, బేబీ ఐలవ్‌యూ" ..ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న రోత బాబా లీలలు

by Ajay Maddhiboyina |

ఢిల్లీకి చెందిన శ్రీ శార‌దా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియ‌న్ మేనేజ్మెంట్ డైరెక్ట‌ర్ స్వామి చైత‌న్యానంద‌ విద్యార్థినుల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న చైత‌న్యానంద లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడంటూ

నీ డ్రెస్ బాగుంది, బేబీ ఐలవ్‌యూ ..ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న రోత బాబా లీలలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఢిల్లీకి చెందిన శ్రీ శార‌దా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియ‌న్ మేనేజ్మెంట్ డైరెక్ట‌ర్ స్వామి చైత‌న్యానంద‌ విద్యార్థినుల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న చైత‌న్యానంద లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడంటూ కొంద‌రు విద్యార్థినులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

కాగా విచార‌ణ‌లో చైత‌న్యానంద లీల‌లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. విద్యార్థినుల‌కు బాబా ఐ ల‌వ్యూ.. నీ హెయిర్ స్టైయిల్ బాగుంది, నీ డ్రెస్సింగ్ బాగుంది అంటూ సందేశాలు పంపిన‌ట్టు పోలీసులు గుర్తించారు. 2024 అక్టోబ‌ర్ లో ఓ విద్యార్థిని అడ్మిష‌న్ పొందిన కొద్దిరోజుల‌కే చైత‌న్యానంద వేధింపుల‌కు గురి చేసిన విష‌యాన్ని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.

ఆ ఏడాది దీపావ‌ళి పండ‌గకు ముందు త‌న‌ను పిలిచార‌ని, అత‌ను త‌న‌వైపు వింత‌గా చూసేవాడ‌ని ఆరోపించింది. త‌న కాలు ఫ్రాక్చ‌ర్ అయిన త‌ర‌వాత ఎక్స్ రే పంపాల‌ని ఆదేశించాడ‌ని, ఆ త‌ర‌వాత వేధింపుల‌కు గురి చేశాడ‌ని పేర్కొంది. కారు పూజ పేరుతో పిలిచి ఆరోజు రాత్రి త‌న‌తో గ‌డ‌పాలని ఒత్తిడి తెచ్చాడ‌ని ఆరోపించింది. అంతే కాకుండా త‌న సందేశాల‌కు రిప్లై ఇవ్వ‌క‌పోతే మార్కులు త‌క్కువ వేస్తామ‌ని, నోటీసులు ఇస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని చెప్పింది.

Next Story