- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానస్పదంగా ఇద్దరు మహిళల మృతి
అనుమానాస్పద రీతిలో ఇద్దరు వివాహితలు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాలో మంగళవారం రాత్రి జరిగింది.

దిశ, మరిపెడ: అనుమానాస్పద రీతిలో ఇద్దరు వివాహితలు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాలో మంగళవారం రాత్రి జరిగింది. మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. భూక్య తండా కు చెందిన మాలోత్ శారద (40), మాలోత్ నీలా (39) ఇరుగుపొరుగు నివాసం ఉంటున్నారు. వ్యవసాయ కూలి ఆధారితంగానే ఇద్దరి కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇరుగుపొరుగువారు కావడంతో ఇద్దరికీ మంచి స్నేహ బంధం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కాగా శారద మంగళవారం సూర్యాపేట వెళ్లి తిరిగి సాయంత్రం తండాకు చేరుకుంది. అనంతరం ఇద్దరు స్నేహితులు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటు ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితి కి చేరుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు ఇద్దరినీ ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రాత్రి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి వైద్యులు పరిశీలించి కార్డియా కరెస్ట్ తో లేదా వడదెబ్బ కారణంగా చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి పూర్తి వివరాలను అటాప్సీ నివేదిక అందిన తర్వాత వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు. కాగా సూర్యాపేట నుంచి తిరిగి వస్తూ శారద మద్యం బాటిల్ కొనుగోలు చేయాగ ఇద్దరు శారద ఇంట్లో మద్యం సేవించిన అనంతరం అపస్మారక స్థితికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తండావాసులు తెలిపారు.






