suicide attempt:విద్యుత్ తీగలు పట్టుకొని కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం...ఒకరు మృతి

by Sridhar Babu |   (  Updated:2024-10-26 15:19:59  IST  )

విద్యుత్ తీగలు పట్టుకుని ఓ కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యాయత్నానికి (suicide attempt)పాల్పడ్డారు.

suicide attempt:విద్యుత్ తీగలు పట్టుకొని కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం...ఒకరు మృతి
X

దిశ, మేడిపల్లి : విద్యుత్ తీగలు పట్టుకుని ఓ కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యాయత్నానికి (suicide attempt)పాల్పడ్డారు. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాపసింగారం (Pratapasingaram)లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాప్ సింగారంలో భార్యాభర్తలు రామకృష్ణ చారి. విజయలక్ష్మి, వీరి కూతురు కలిసి ఇంట్లోని విద్యుత్ తీగలు పట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. కూతురుకు తృటిలో ప్రమాదం తప్పింది. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలిందని, పూర్తి వివరాలు సేకరిస్తున్నామని సీఐ గోవింద రెడ్డి తెలిపారు.

Next Story