Suicide: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-20 07:27:13  IST  )

రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Suicide: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మెదక్ (Medak) జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పోడ్చన్‌పల్లి (Podchanpally) గ్రామానికి చెందిన సింధూజ (Sindhuja) (19) ఇంటర్ మెదటి సంవత్సరం చదువుతోంది. అయితే, గత నెల రోజులుగా సింధూజ కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆదివారం తల్లిదండ్రులు, కూతరుని కళాశాలకు వెళ్లాలని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సింధూజ ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story