- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడుపు నొప్పితో విద్యార్థి మృతి
దిశ, మంచిర్యాల : కడుపు నొప్పితో విద్యార్థి మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, మంచిర్యాల : కడుపు నొప్పితో విద్యార్థి మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం అవడం గ్రామానికి చెందిన బేతు వర్షిత్ సాయి (14 ), కడుపు నొప్పితో మృతి చెందాడు. నెన్నెల ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆవడ గ్రామంలో 9వ తరగతి చదువుతున్న వర్షిత్ సాయి మంగళవారం పాఠశాలకు వెళ్లి వచ్చాడు. అనంతరం అదే గ్రామాల్లో ఉన్న అమ్మమ్మ, తాత ఇంటికి వెళ్లి వాళ్లతో కలిసి బగారా రైస్, చికెన్ కర్రీతో భోజనం చేశాడు. తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్లి పప్పుతో భోజనం చేశాడు. బుధవారం ఉదయం కడుపు నొప్పి వస్తుందని ఇంట్లో చెప్పడంతో యువకుడిని స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. నొప్పి ఎక్కువ కావడంతో స్థానిక వైద్యుడు సూచనల మేరకు మంచిర్యాల లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కరీంనగర్ తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.






