- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం
కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేగింది. ఏపీలోని వడ్డేశ్వరం వద్ద యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సురేష్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేగింది. ఏపీలోని వడ్డేశ్వరం వద్ద యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సురేష్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసులు రాకముందే డెడ్ బాడీని తరలించే ప్రయత్నం చేశారు. దీనిని అక్కడే ఉన్న విద్యార్థులు వీడియో తీశారు. పోలీసులు రాకముందే విద్యార్థి డెడ్ బాడీ తరలించారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగాయి.
వీసీ, డీన్, రిజిస్ట్రార్ సరిగ్గా స్పందించకపోవడంతో కాంచనగంగా హాస్టల్ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. సురేష్ మృతిపై తక్షణమే విచారణ జరిపి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే వివరాలు ఇంకా తెలియలేదు. చదువు ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే పర్సనల్ కారణాల వల్ల చేసుకున్నాడా అనేది తేలాల్సింది.






