- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సృష్టి ఫెర్టిలిటీ కేసు.. ఆ ముగ్గురు ప్రభుత్వ వైద్యులపై సస్పెన్షన్ వేటు
‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసు (‘Srishti’ Fertility Case)లో సీసీఎస్ సిట్ పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసు (‘Srishti’ Fertility Case)లో సీసీఎస్ సిట్ పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. అయితే, కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత (Dr. Namrata)తో సంబంధాలు కలిగి ఉన్న విశాఖకు చెందిన ముగ్గురు వైద్యులను ఆగస్టు 8న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్ వాసుపల్లి రవి, డాక్టర్ ఉషాదేవి, డాక్టర్ విద్యుల్లత ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైద్యులుగా కొనసాగుతోన్న ఆ ముగ్గురి విషయంలో తాజాగా చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వారిపై కేసులు నమోదైన నేపథ్యంలో తాజాగా డాక్టర్ రవి, ఉషాదేవి, విద్యుల్లతను విధుల నుంచి తప్పిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే ఈ కేసులు ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రత (Doctor Namrata)తో సహా మొత్తం 29 మంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
కాగా, సరోగసి ముసుగులో ఇప్పటి వరకు నమ్రత సుమారు 50 మంది బాధితుల దగ్గర రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అదేవిధంగా మరో కీలక నిందితురాలు సంతోషి ఏజెంట్ల నుంచి 18 మంది శిశువులు సేకరించినట్లుగా తేలింది. ముఖ్యంగా గిరిజన మహిళలను ప్రలోభాలకు గురిచేసి వారి నుంచి శిశువులను రూ.5 లక్షలకు విక్రయించి తన వద్దకు వచ్చిన క్లయింట్లకు రూ.50 లక్షలకు డాక్టర్ నమ్రత (Dr. Namrata) విక్రయించినట్లుగా తెలింది. ఇప్పటి వరకు 80 మంది పిల్లలను అమ్మినట్లుగా బట్టబయలైంది. దీంతో పోలీసులు ఇటీవల డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ‘సృష్టి’ కేసులో తల్లులను గుర్తించి శిశువులను తిరిగి వారికి అప్పగించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.






