- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉచితం అంటూ.. బెట్టింగ్ ఉచ్చు
అమాయకులను బెట్టింగ్‌లకు బానిసలుగా మార్చాలనే కుట్రతోనే ఐ-బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఆన్‌లైన్ గే మింగ్, బెట్టింగ్ సంస్థలతో మిలాఖత్ అ యినట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు ల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పోలీసులు దాఖలు చేసిన రి మాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు.

దిశ, సిటీక్రైం: అమాయకులను బెట్టింగ్‌లకు బానిసలుగా మార్చాలనే కుట్రతోనే ఐ-బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఆన్‌లైన్ గే మింగ్, బెట్టింగ్ సంస్థలతో మిలాఖత్ అ యినట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు ల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పోలీసులు దాఖలు చేసిన రి మాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో ఉచితంగా సినిమాలను వీక్షించేందుకు 56 లక్షలకు పైగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. బెట్టింగ్ యాప్‌ల మాయలో పడ్డ చాలా మంది ఆర్థికంగా చి తికిపోయి అప్పుల్లో కూరుకుపోయారు. ఆ ర్థికంగా నష్టపోయిన కొందరు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలూ ఉన్నాయి. ఇమ్మ డి రవి కేవలం తన ఆర్థిక లాభం కోసం త న వెబ్‌సైట్‌లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. ఇది రవికి ఆర్థికంగా భారీగా లా భం చేకూర్చినా ఎక్కువ సంఖ్యలో అమాయకులను బెట్టింగ్ యాప్ ఉచ్చులో చిక్కే లా చేసి వారి జీవితాలను నాశనం చేసిం ది. ఈ చర్య దేశ డిజిటల్ భద్రతకు ముప్పు తో పాటు అమాయకులను బెట్టింగ్‌లకు వ్యవసనపరులుగా మార్చేశాడు.
రూ.కోట్లకు పడగెత్తాడు..
ఈ బెట్టింగ్ కుట్ర కోణంతో పాటు దేశా నికి సంబంధించిన డిజిటల్ సేఫ్టీకి ముప్పు గా మారిన వ్యవహారాలపై ఆధారాలను సే కరించాల్సింది ఉంది. బెట్టింగ్ యాప్‌లతో కలిసి చేసిన ఈ కుట్రతో ఇమ్మడి రవి ఇ ప్పటి వరకు రూ.21 కోట్ల వరకు సంపాదించాడు. అతని అరెస్టు సమయంలో పోలీసులు రూ.3 కోట్ల నగదును రికవరీ చేశారు. రూ.80 లక్షలు చెల్లించి ఏకంగా కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ నేవిస్ దేశంలో పౌరసత్వం తీసుకున్నాడు.
లింక్‌లతో వల
తన స్వార్థం కోసమే వన్ విన్, వన్ ఎక్స్ బెట్‌తో పాటు ఇంకా చాలా బెట్టింగ్ యాప్‌లతో కుమ్మక్కయ్యాడు. దీని కోసమే అతను కుట్రపూరితంగా తన ఐ బొమ్మ, బప్పం వెబ్‌సైట్‌లలో సినిమాలు చూసే వారిని బెట్టింగ్ యాప్‌లు క్లిక్ చేసేలా లింక్‌లను తయారు చేసి సినిమా మధ్యలో వాటిని ప్రదర్శించి అది క్లిక్ చేస్తే సినిమా కొనసాగేలా చేశాడు. ఈ చర్య చట్టపరంగా క్షమించరానిదని చాలా మంది అమాయకుల జీవితాలను ఈ వెబ్‌సైట్ ద్వారా అతను చిన్నాభిన్నం చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో న్యాయస్థానానికి తెలిపారు.






