బ్రేకింగ్: మాదాపూర్‌ పరిధిలోని పబ్బులపై SOT పోలీసుల ఆకస్మిక రైడ్స్

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: మాదాపూర్‌ పరిధిలోని పబ్బులపై SOT పోలీసుల ఆకస్మిక రైడ్స్
X

దిశ, తెలంగాణ క్రైమ్ ​బ్యూరో: మాదాపూర్​ జోన్​ పరిధిలోని పబ్బులపై సైబరాబాద్​ ఎస్వోటీ పోలీసులు శనివారం ఆకస్మిక దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్వోటీ డీసీపీ ఎం.ఏ. రషీద్​తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాదాపూర్ ​జోన్‌లోని పలు పబ్బుల్లో నిబంధనలను పాటించటం లేదన్న సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు మొత్తం పదహారు పబ్బులపై దాడులు జరిపారు.

హార్ట్​కప్, బర్డ్​బాక్స్ ​పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. బర్డ్​బాక్స్ ​పబ్బుకు లైసెన్స్​ లేదని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో హార్ట్​కప్ ​పబ్బు యజమాని ఎం.పవన్​కుమార్, మేనేజర్​ ఆదిత్య తమంగ్‌ను అరెస్టు చేశారు. బర్డ్​బాక్స్ ​పబ్బు యజమాని వంశీవర్ధన్, మేనేజర్​ అర్జున్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్బుల గురించి తెలిస్తే 94906 17444 నెంబర్‌కు వాట్సాప్​ద్వారా వివరాలు తెలియచేయాలని డీసీపీ కోరారు.



Next Story

Most Viewed