అత్తతో సుఖం పొందాలని అల్లుడి స్కెచ్.. స్నేహితుడితో కలిసి..

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-03-27 13:08:46  IST  )

భార్యపై కన్నేసిన అల్లుడు ఎలాగైన ఆమెను సొంతం చేసుకోవాలనే దుర్భుద్దితో మేనమామను హత్య చేశాడు.

అత్తతో సుఖం పొందాలని అల్లుడి స్కెచ్.. స్నేహితుడితో కలిసి..
X

దిశ, వెబ్‌డెస్క్ : మేనమామ భార్యపై కన్నేశాడో అల్లుడు. ఆమెకు తెలియకుండానే లవ్ చేశాడు. ఎలాగైనా అత్తతో బెడ్ రూంలో దూరాలని కలలు కన్నాడు. అయితే ఇవేమి తెలియని అత్త అల్లుడితో మామూలుగానే నడుచుకుంది. కానీ అత్తను వన్ సైడ్ లవ్ చేసినా అల్లుడు.. రోజురోజుకు ఆమెపై కోరికలు పెంచుకున్నాడు. అత్తను సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్న అల్లుడు.. మేనమామను అడ్డుతొలగించుకోవాలని పన్నాగం పన్నాడు. అనుకుందే ఆలస్యం.. స్నేహితుడితో కలిసి పక్కాగా స్కెచ్ వేసి అత్తకు కూడా అనుమానం రాకుండా మట్టుబెట్టాడు. కానీ పోలీసులకు వచ్చిన అనుమానంతో కథ అడ్డం తిరిగింది. ఉత్తరప్రదేశ్‌లో కలకలం సృష్టించిన ఈ దారుణ ఘటనలో అసలేం జరిగిందంటే..?

రాంపూర్ ఏఎస్పీ అనురాగ్ సింగ్ కథనం ప్రకారం.. రాంపూర్ జిల్లాలోని టాండా పోలీస్ స్టేషన్‌కు మార్చి 13 రాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఓ వ్యక్తి యాక్సిడెంట్‌లో మరణించాడని, మృతదేహం రోడ్డుపై పడి ఉందని ఆ ఫోన్ సారాంశం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, స్థానికులను విచారించగా మృతుడు సైద్ నగర్‌కు చెందిన వ్యక్తిగా తేలింది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కానీ శవ పంచనామా సమయంలో మృతుడి మొఖం, గొంతుపై గాయాలు కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే డెడ్ బాడీని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కేసు దర్యాప్తులో భాగంగా ముందుగా మృతుడి భార్యను అన్ని కోణాల్లో విచారించారు. దాంట్లో ఆమె ప్రమేయం లేదని భావించిన పోలీసులు కుటుంబ సభ్యులపై ఫోకస్ చేశారు. దీంతో మృతుడి మేనల్లుడు వీరేంద్ర కదలికలు, వ్యవహారశైలి అనుమానస్పదంగా కనిపించింది. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. తనకు అత్తంటే పిచ్చి ప్రేమని, ఆమెతోనే నా జీవితం అని తెలిపాడు. అత్తతోనే కలిసి బతకాలని నిర్ణయించుకున్నానని, కానీ మామయ్య ఉండగా అది సాధ్యపడదని భావించి, అతడిని అడ్డుతొలగించుకుంటే అత్త నా సొంతం అవుతుందని అనుకున్నానని వివరించాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు జితేంద్రకు చెప్పి సహకరించాలని కోరడంతో అతడు అంగీకరించాడని చెప్పాడు.

స్కెచ్‌లో భాగంగా వీరేంద్ర, జితేంద్ర కలిసి తన మేనమానను గ్రామ శివారులోని పంటపొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు ఫుల్‌గా మద్యం తాగారు. ఆ తర్వాత ఇద్దరు స్నేహితులు కలిసి మేనమామ గొంతుకు మఫ్లర్ బిగించి హత్య చేశారు. ఆ తర్వాత బైక్‌తో సహా మృతదేహాన్ని రోడ్డుపైకి తీసుకెళ్లి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి వెళ్లిపోయారు. అయితే గొంతు మీది గాయాలతో పోలీసులకు అనుమానం వచ్చి పోస్ట్ మార్టం నిర్వహించడంతో హత్యగా తేలింది. వీరేంద్ర తన అత్తను వన్ సైడ్ లవ్ చేసి మేనమామను హత్య చేయడం రాంపూర్ జిల్లాలో సంచలనంగా మారింది. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు ఏఎస్పీ అనురాగ్ సింగ్ వెల్లడించారు.

Next Story