- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైలులో ఆరేళ్ల చిన్నారిపై దారుణం.. బాత్రూమ్ లో పడేసి..
ఆరేళ్ల చిన్నారిని హత్య చేసి రైలు బాత్రూమ్ లోని చెత్తబుట్టలో పడేశారు దుండగులు. ఈ ఘటన కుషినగర్ ఎక్స్ ప్రెస్ లో వెలుగుచూసింది.

దిశ, వెబ్‌డెస్క్: రైలులో ఆరేళ్ల చిన్నారిపై దారుణ ఘటన జరిగింది. గుజరాత్ లో చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు నాసిక్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కుషినగర్ ఎక్స్ ప్రెస్ (Kushinagar Express) ట్రైన్ ఎక్కించి దారుణంగా హతమార్చారు. ఆపై చిన్నారి మృతదేహాన్ని రైలు బాత్రూమ్ లోని చెత్తబుట్టలో కుక్కి పరారయ్యారు. లోకమాన్య తిలక్ టెర్మినస్ (Lokamanya Tilak Terminas)లో ఆగిన రైలులో మృతదేహాన్ని గుర్తించిన క్లీనింగ్ సూపర్ వైజర్ పోలీసులకు సమాచారమిచ్చారు. చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు పంపిన పోలీసులు.. తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
రైల్వే అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషినగర్ ఎక్స్ ప్రెస్ (22537) థర్డ్ ఏసీ కోచ్ (B2) టాయిలెట్ లో ఉన్న చెత్తబుట్టలో ఆరేళ్ల చిన్నారి డెడ్ బాడీ కనిపించింది. శనివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ లో ప్లాట్ ఫామ్ 4కు కుషినగర్ ఎక్స్ ప్రెస్ వచ్చింది. ప్లాట్ ఫారమ్ పై ఉన్న రైలును శుభ్రం చేస్తుండగా.. టాయిలెట్ చెత్తబుట్టలో చిన్నారి మృతదేహం కనిపించింది. వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసులు, సీనియర్ రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించి, రాజవాడి ఆస్పత్రికి తరలించారు. చిన్నారి గొంతుకోసి చంపి చెత్తబుట్టలో దాచారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






