గుండెను పిండేసే విషాదం.. పెళ్లికి కొన్ని గంటల ముందు అక్కాచెల్లెళ్లు సూసైడ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-22 11:37:32  IST  )

రాజస్థాన్‌ రాష్ట్రం జోధ్‌పూర్ జిల్లాలోని మనాయ్ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది.

గుండెను పిండేసే విషాదం.. పెళ్లికి కొన్ని గంటల ముందు అక్కాచెల్లెళ్లు సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌(Rajasthan) రాష్ట్రం జోధ్‌పూర్ జిల్లాలోని మనాయ్ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు ఇద్దరు కూతుళ్ల పెళ్లి వైభవంగా చేసి సంతోషించాలనుకున్న తల్లిదండ్రులకు విషాదం ఎదురైంది. శనివారం వివాహం జరగాల్సి ఉండగా ముందు రోజు రాత్రి అక్కాచెల్లెళ్లు శోభ(25), విమల(23) విషం తాగారు. బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనుమానం వచ్చి.. మేనమామ జస్వంత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి అంత్యక్రియలను నిలిపేశారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మృతదేహాలు నీలి రంగులోకి మారాయని, ఇది విష ప్రయోగంవల్ల జరిగిన ఆత్మహత్యేనని మేనమామ ఆరోపించారు. బాధితుల బాబాయ్‌లు, ఈ పెళ్లిళ్ల విషయంలో తీవ్ర ఒత్తిడి తెచ్చారని, మొదట కుదిరిన పెళ్లి సంబంధాలను రద్దుచేసి, బాబాయ్‌ల ఒత్తిడి మేరకు పోఖ్రాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులతో పెళ్లిళ్లు నిశ్చయించారని చెప్పారు. ఈ బలవంతపు పెళ్లి ఇష్టంలేకనే తన మేనకోడళ్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story